Sunday, May 12, 2024

గీతాసారం (ఆడియోతో…)

అధ్యాయం 6, శ్లోకం 25

శనై: శనైరుపరమేత్‌
బుద్ధ్యా ధృతిగృహీతయా |
ఆత్మసంష్థం మన: కృత్వా
న కించిదపి చింతయేత్‌ ||

తాత్పర్యము : నిశ్చయమైన బుద్ధితో క్రమముగా నెమ్మది నెమ్మదిగా మనుజుడు సమాధిమగ్నడు కావలెను. ఆ విధముగా మనస్సును ఆత్మ యందే నిలిపి అతడు ఒక దేనిని గూర్చియు చింతింపరాదు.

భాష్యము : సరైన బుద్ధి, దృఢనమ్మక ముతో క్రమేణ మనస్సును ఇంద్రియ భోగము నుండి విడి పరచి సమాధిలో మగ్నమయ్యేట ట్లు చేయవలెను. ఈ శరీరము ఉన్నంత వరకు వేర్వేరు అవసరాలకు కార్యాలను చేయవలసి వచ్చినా ఇంద్రియ భోగము గురించి ఆలోచించరాదు. అలాంటి స్థితి అనగా మన ఆనందము కాక కృష్ణుని ఆనందమును గురించియే ఆలోచించుట అనేది కృష్ణ చైతన్య సాధన ద్వారా సులభ సాధ్యమగును.

Advertisement

తాజా వార్తలు

Advertisement