Wednesday, May 8, 2024

గీతాసారం (ఆడియోతో…)

ఆధ్యాయం 6, శ్లోకం 34

చంచలం హి మన: కృష్ణ
ప్రమాథి బలవద్దృఢమ్‌ |
తస్యాహం నిగ్రహం మన్యే
వాయోరివ సుదుష్కరమ్‌ ||

తాత్పర్యము : ఓ కృష్ణా! మనస్సు చంచలమును, కల్లోలపూర్ణమును, ధృఢమును, చాలా బలవత్తరమును అయియున్నది. దీనిని నిగ్రహించుట వాయువును నిగ్రహించుట కన్నను కష్టతరమని నేను భావించుచున్నాను.

భాష్యము : మనస్సు బుద్ధికి లోబడి ఉండవలెను, కాని అది ఎంత బలీయమైనదంటే బుద్ధిని తప్పుదోవ పట్టించి పతనానికి దారి తీస్తుంది. ఏ విధముగా నైతే గుర్రపు పగ్గాలు, రధాన్ని నడిపే వ్యక్తి అదుపు తప్పితే ప్రయాణించే వ్యక్తి అపాయ స్థితిలో పడినట్టు, గుర్రాల వంటి ఇంద్రియాలు, మనస్సు అదుపు తప్పినప్పుడు జీవిని భయానక స్థితోకి తీసుకువెళతాయి. కాబట్టి అర్జునుడు వేగంగా వీచే గాలిని బంధించటము ఎంత కష్టమో శ్రతువు, మిత్రుడు అను భావన నుండి మనస్సును కృత్రిమముగా విడి పరచుట మరింత కష్టమని తెలియజేయుచున్నాడు. కాబట్టి ప్రస్తుత పరిస్థితులలో ఒకే ఒక్క తరుణోపాయమేమనగా వినయముతో, ఉత్సాహముతో ‘హరే కృష్ణ’ మహా మంత్రాన్ని చేయుట. అలా మనస్సును పూర్తిగా కృష్ణుని యందు నిమగ్నము చేసినచో, ఇతర ఆలోచనలతో కలుషితమయ్యే అవకాశమే ఉండదు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement