Friday, May 3, 2024

వీక్లీ పరేడ్​తో ఫిజికల్ ఫిట్‌నెస్.. ప్రతి ఒక్కరూ టైమింగ్​ పాటించాలి: సీపీ చంద్రశేఖర్ రెడ్డి

ప్రతి ఒకరు సమయపాలనతో పాటు క్రమశిక్షణ పాటించాలని రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం రామగుండం పోలీస్ కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ పరేడ్ గ్రౌండ్ లో సివిల్, ఆర్మూడ్ రిజర్వ్ పోలీస్, హోంగార్డ్ సిబ్బందికి వీక్లీ పరేడ్ నిర్వహించారు. పరేడ్ కి సిపి హాజరై గౌరవ వందనం స్వీకరించి, సిబ్బంది ప్రదర్శించిన ఆర్మ్స్ డ్రిల్, స్క్వాడ్ డ్రిల్, లాఠీ డ్రిల్, ట్రాఫిక్ డ్రిల్ ను పరిశీలించారు.

ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ వీక్లీ పరేడ్ వల్ల సిబ్బందికి, ఫిజికల్ ఫిట్నెస్ తో పాటు, సమయం దొరికినప్పుడు సిబ్బంది, అధికారులు వ్యాయామం చేయడం అనేది చాలా ముఖ్యం అని, మంచి శక్తి సామర్థ్యాలతో ఎలాంటి అనారోగ్యానికి గురికాకుండా విదులు నిర్వహించడానికి మంచి అవకాశం ఉంటుంద‌న్నారు.

ఫిజిక‌ల్ ఫిట్‌నెస్‌ ను నిత్యం కాపాడుకోవాలన్నారు సీపీ చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి. వీక్లీ పరేడ్ లలో ఏదైనా సమస్యలు ఉంటే పై ఆఫీసర్లకు చెప్పుకునే వీలుంటుందని. చెడు అలవాట్లకు లోనుకాకూడదు అన్నారు. పోలీసులు మంచి జీవన విధానాన్ని అవలంబించాలన్నారు. క్రమశిక్షణతో డ్యూటీలను నిర్వర్తించాలని, సిబ్బందికి చేయవలసిన విధులు, చేయకూడని పనుల గురించి పలు సూచనలు చేశారు. ఏదైనా వ్యక్తి గత సమస్యలు ఉన్న, డ్యూటీల వద్ద సమస్య ఉన్న, ఆరోగ్య సమస్య ఉన్న ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావలన్నారు.

- Advertisement -

చెడు వ్యసనాలకు, చెడు స్నేహాలకు అలవాటు పడి, విధులలో నిర్లక్ష్యం వహించొద్ద‌ని, పోలీస్ శాఖ ప్రతిష్టకి భంగం కలిగించేలా ప్రవర్తించరాదని, మంచి క్రమ శిక్షణ కలిగియుండి సమయపాలన పాటించాలి తెలిపారు. ప్రతి ఒక్కరూ యూనిఫామ్ నిట్ టర్న్ ట్ కలిగి ఉండాలని సూచించారు. రెగ్యులర్ గా హెల్త్ చెక్ అప్స్ చేయించుకోవాలన్నారు.

పరేడ్ లో పెద్దపల్లి డీసీపీ సిహేచ్ రూపేష్, గోదావరిఖని ఏసీపీ గిరి ప్రసాద్, ట్రాఫిక్ ఏసీపీ బాలరాజు, ఏఆర్ ఏసీపీ సుందర్ రావు, గోదావరిఖని టౌన్ ఇన్స్పెక్టర్ లు ప్రసాద్ రావు, గోదావరిఖని టూ టౌన్ ఇన్స్పెక్టర్ వేణు గోపాల్, ఆఫ్జాలుద్దీన్ , రామగుండం సర్కిల్ ఇన్స్పెక్టర్ లక్ష్మి నారాయణ, రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, ఆర్ ఐ లు మధుకర్, శ్రీధర్, విష్ణు ప్రసాద్, ఎస్.ఐ లు, ఆర్.ఎస్.ఐ లు , సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement