Wednesday, February 8, 2023

అత్యంత శక్తివంతం…హనుమ పంచముఖ అవతారం

ఆంజనేయస్వామి శ్రీమద్రామాయణానికి గొప్ప ప్రకాశాన్ని తీసుకువ చ్చిన మహాపురుషుడు. రామాయణం అనే రెండు పేటల మాలను జతచేసే మధ్యలో మణిలాంటివాడు ఆంజనేయస్వామి అన్నారు.
శ్రీరామాయణంలో అద్భుతమైన పాత్ర పోషించిన హనుమంతుని స్మరించిన, నమస్కరించిన, సేవించినంత జాడ్యం పోతుంది. జాడ్యం అంటే జడత్వం పోతుంది. శ్రీరామాయణంలో రామచంద్రమూర్తిగా విష్ణుమూర్తి భూలోకానికి వచ్చేముందే. బ్రహ్మదేవుడు అనేకమంది దేవతలను వానరాంశతో భూలోకానికి పంపించారు. అయితే హనుమంతుడు మాత్రం అప్పుడు రాలేదు.
బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండల్లో హనుమ కనిపించడు. కిష్కింద కాండ ప్రారంభంలో కనిపిస్తాడు. సుందరకాండలో హనుమ అద్భుతమైన పాత్రను పోషించాడు. కిష్కిందకాండలో హనుమంతుడు ఎలా పుట్టాడు అని మహర్షి చెప్పలే దు. అసలు హనుమ అవతార విశేషాన్ని ఉత్తరకాండలో చెబుతారు. హనుమంతునిది మాత్రం చాలా విచిత్రమైన అవతారం. విశేషమైన అవతారం. రామాయణగాథ అనంతరం చిరంజీవిగా భక్తులను రక్షిస్తున్నది ఆంజనేయస్వామి మాత్రమే. ఆ స్వామి అనేక అవతారాలతో వచ్చి ఈ లోకంలో భక్తులను అనుగ్రహించారు.
భక్తితో తలచిన… పూజించిన భక్తుల కష్టాలను తీర్చి, అభీష్టాలను నెరవేర్చేవాడు పవనసుతుడు. పం చముఖ రూపంలో వున్న ఆంజనే యస్వామిని ఆరాధించడం అత్యంత ఫలప్రదమైనది. ఈమధ్యన ఎక్కువ గా పంచముఖ ఆంజనేయస్వామినే ఆరాధిస్తున్నారు. త్రేతాయుగంలో రామలక్ష్మణులను రక్షించడానికి హనుమంతుడు పంచముఖునిగా మారాడు. అప్పటినుంచే ఆంజనేయ స్వామిని పంచముఖ రూపంలో పూ జించడం మొదలైంది.
శ్రీరామ రావణ భీకర యుద్ధ సమయంలో రావణాసురుడు తన బంధువు, పాతాళ లోకానికి అధిపతి అయిన మైరావణుని సహాయం కోరతాడు. మైరావణుడి నుండి రామలక్ష్మణులకు ప్రమాదం పొంచివుందని గ్రహిస్తాడు హనుమంతుడు. రామలక్ష్మణుల చుట్టూ కాపలా వుంచు తాడు. అయినా అందరి కళ్లూ కప్పి రామలక్ష్మణులను పాతాళలోకానికి అపహరించు కుపోతాడు మైరావణుడు. వెనువెంటనే ఆంజనేయస్వామి మైరావణుని రాజ్యానికి వెళతాడు. అతనితో యుద్ధం ప్రారంభిస్తాడు. మైరావణుని మరణం వెనుక వున్న రహ స్యాన్ని తెలుసుంటాడు హనుమ. మైరావణపురంలో ఐదు దిక్కులా వెలిగించి ఉన్న దీపాలను ఒకే సమయంలో ఆర్పితేకానీ అతన్ని సంహరించడం అసాధ్యమని తెలిసి, తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ, ఊర్థ్వ ముఖం… ఈ అయిదు దిక్కులా అయిదు ము ఖాలను ధరించి, అయిదు దీపాలను ఒక్కసారిగా ఛేదిస్తాడు. పంచముఖాలతో పాటుగా ఏర్పడిన పది చేతులలో ఖడ్గం, శూలం, గదవంటి ఆయుధాలు ధరించి. .. మైరావణుని అంతం చేస్తాడు హనుమంతుడు. ఆయనే పంచముఖాంజనేయస్వామి.

పంచముఖాల ప్రాశస్త్యం

- Advertisement -
   

ఆంజనేయస్వామి పంచముఖాలలో ఒకో మోముదీ ఒకో రూపం. తూర్పున ఆంజనేయుని రూపం, దక్షిణాన నారసింహుని అవతారం, పశ్చిమాన గరుడ ప్రకా శం, ఉత్తరాన వరాహావతారం, ఊర్ధ్వముఖాన హయగ్రీవుని అంశ. అలాగే ఆ అయిదు ముఖాలు తన భక్తులకు అయిదు రకాల అభయాన్ని ఇస్తూ ఉంటాయి. నారసింహ ము ఖం విజయాన్ని, గరుడ రూపం దీర్ఘాయుష్షునీ, వరాహము అష్ట ఐశ్వర్యాలనీ, హయ గ్రీవుడు జ్ఞానాన్నీ, ఆంజనేయ రూపం అభీష్ట సిద్ధిని కలుగచేస్తాయి. ఇంతటి శక్తిమం తమైన అవతారం కాబట్టే రాఘవేంద్రస్వామి సైతం ఆంజనేయుని పంచముఖ రూపంలోనే పూజించారు. దర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement