Sunday, May 19, 2024

అన్నమయ్య కీర్తనలు : కలిగెనిదె నాకు

రాగం : సింధు భైరవి
కలిగెనిదె నాకు కైవల్యము
తొలుతనెవ్వరికి దొరకనిది

జయపురుషోత్తమ జయ పీతాంబర
జయ జయ కరుణా జలనిధి
దయ ఎరంగనే ధర్మము నెరగనా
క్రియయిది నీ దివ్య కీర్తనమే

శరణము గోవింద శరణము కేశవ
శరణు శరణు శ్రీ జనార్థనా
పరమమెరంగను భక్తి యెరంగును
నిరతము నాగతి నీ దాస్యమే

నమో నారాయణ నమో లక్ష్మీపతి
నమ: పుండరీక నయనా
అమిత శ్రీ వేంకటాధిప యిదె నా
క్రమమెల్లను నీ కైంకర్యమే

Advertisement

తాజా వార్తలు

Advertisement