Saturday, May 25, 2024

ధర్మో రక్షతి రక్షిత:!

ఆపద్ధర్మం అనే మాటను పెద్దల నోటి నుంచి మనం తరుచూ వింటూ ఉంటాం. ఇతరు లను ఆపదల నుంచి కష్టాల నుంచి కాపాడటానికి తానే ఆ ఆపదను కష్టాన్ని ఎదుర్కోవాలి. అప్పుడే అత డు చేసిన ఆ పని ధర్మం అనిపించుకొంటుంది.
ధర్మం మానవ జీవితాన్ని నియమపూర్వ కంగా ముందుకు నడిపిస్తుంది. మానవులంతా కలిసి మెలిసి ఉండాలని ఉద్బోధిస్తుంది. సహనాన్ని నేర్పు తుంది. సంయమాన్ని అలవరచుకొమ్మంటు ంది. వైరుధ్యంతో కూడిన విశ్వాసాలను, భావా లను అధిగ మించాలని చెబుతుంది. సామరస్య పూర్వ కంగా ఐక్య తను సాధించుకొమ్మంటుంది. పర ధర్మం లేదా పర మతంలో ఉండే విశిష్టతలను స్వీకరించమని చెబు తుంది. పొరపాటు చేసిన వాళ్లను మన్నించమని చెబుతుంది.
వేదాలలో ధర్మానికి విశిష్ఠ స్థానం ఉంది. వేద కాలంలో, ఉపనిషత్తుల యుగంలో ధర్మం సమస్త వేదశాస్త్ర సారంగా భాసించేది. ధర్మం జ్ఞానానికి పర మానంగా, వేద ప్రబోధ సాధనంగా మనకు దర్శ నం ఇస్తుంది. ఆనాటి కాలంలో ధర్మానికి హెచ్చు తగ్గులనే తారతమ్యం లేదు. ఆనాటి సామాజిక వ్యవస్థలో ధర్మానికి అద్వితీయమైన గౌరవం లభించింది. ఋషుల శాస్త్ర చర్చల్లో ధర్మం అగ్ర స్థానం వహిం చేది. మహాపండితుల, ఆచార్య గురుదేవుల ధార్మిక ప్రసంగాల్లో ధర్మం అణు వణువునా సాక్షాత్కరించేది కూడా.
ఈ జగత్తులో ధర్మమే గొప్పది. ధర్మాచరణను మించిన శ్రేష్ఠమైన మహత్కార్యం మరొకటి లేదు. సమస్త ప్రాణుల సుఖాన్ని కాంక్షించి ఋషులు సూత్రీ కరించిన జీవన విధానమే ధర్మం. ఈ ధర్మం ప్రధా నంగా పది లక్షణాలు కలిగి వుంటుంది. అవి- ధృతి, క్షమ, దయ, అస్తేయం, శౌచం, ఇంద్రియ నిగ్రహం, ధీ:, విద్య, సత్యం, అక్రోధం. వీనిని మానవులు వారి జీవితంలో నెమ్మది నెమ్మదిగా సాధించాలి. తద్వారా ఉత్తమ ఫలితాలు పొందవచ్చు.
శరీరం గృహం కాబట్టి శరీర ధర్మాలను శాస్త్రో చితంగా నిర్వహించాలి. శరీరానికి నివాసగృహం ఉంటుంది కనుక, గృహస్థ ధర్మాలు ప్రత్యేక శ్రద్ధతో పాటించాలి. ప్రపంచమూ గృహంతో సమానం కనుక సర్వప్రాణుల్ని తన గృహంలోకి సహజీవు లుగా, సమానాధికారాలు గలవారిగా గుర్తించి, ఆత్మీ యంగా, ప్రేమాస్పదంగా వ్యవహరించాలి. ప్రపంచ గృహానికి పరమాత్మే నిజ యజమాని కనుక, ఆయన పట్ల భక్తిశ్రద్ధలు, విధేయత కలిగి వుండడం ఉత్తమ ధర్మం అవుతుంది.
సృష్టిలో అత్యంత మధురమైనది మాతాపితల ధర్మం. దానికంటే మధు రాతి మధురమైనది దైవధర్మం. ఆ విధంగా తల్లిదండ్రుల్లో దైవ ధర్మాన్ని చూడాలి. దేవుడిలో తల్లిదండ్రుల్ని దర్శించాలి. ఎందుకంటే తల్లిదండ్రులూ దైవమూ వేర్వేరు కాదు. దైవం ఎక్కడో లేడు మనంచేసే ధర్మంలోనే ఉన్నాడు. అంతటా అందరిలోనూ లోకధర్మంలో ఉన్నాడు. ధర్మ స్వరూపుడైన దైవం అంతర్యామియై ఉన్నాడు.
ధర్మాన్ని గుర్తించి, నోరెత్తకుండా తన పని తాను చేసుకుపోవడమే ఆధ్యాత్మికతలో ఉన్న పరమ రహస్యం. చాలామంది సాధకులు భగ వంతుణ్ని, భగవ ద్ధర్మాన్ని తెలుసుకొన్న తర్వాత మౌనం వహిస్తుంటా రు. ఎందుకంటే భగవద్ధర్మ ప్రకంపనల సాక్షిగా చూస్తూ, లోపల పరమానం దాన్ని వాళ్ళు పొందు తుంటారు. ఇది నిజమా, ఇదే నిజమా? ధర్మశాస్త్రాలు గురువులు ఈ విషయా న్ని పదేపదే చెబుతున్న ప్పుడు విశ్వసించాలి మరి.
ధర్మాలన్నీ మహత్తరమైనవే. ఇతిహాస పురాణాలు కొన్ని సంఘటనలు, గాథల ద్వారా కొన్ని ధర్మాల విశిష్టతను వెల్లడిస్తాయి. మరి కొన్ని దివ్య ధర్మాలు తమ వైశి ష్ట్యాన్ని గుప్తంగా, భావ గర్భితంగా నిక్షేపించు కొంటాయి.
నిజానికి అన్ని ధర్మముల గమ్యమూ ఒక్కటే. ఇది ఒకే ప్రపంచం. అన్నింటిలోనూ గమ్యమూ ఒక్కటే. ఇది ఒకే ప్రపంచం. అన్నింటి లోనూ ఏక త్వమే భాసిస్తుంది. వ్యక్తులు మాత్రం స్వతంత్రులు. సత్య ధర్మాన్వేషకులు. ఆధ్యాత్మిక ప్రయాణం మొద లు పెట్టగానే కొందరికి అజ్ఞానం ఆవరిస్తుంది. వాళ్ళు నిరాశకు లోనవుతారు. అధర్మం ఆవరించనివారు, ఆధ్యాత్మిక మార్గంలో హాయిగా పయనించి గమ్యం చేరుకుంటారు. ధర్మాన్ని చాలామంది ఒక ఆయు ధంగా ఉపయో గిస్తుంటారు.
కానీ వినయాన్ని ఆయుధంగా అనుభవ జ్ఞానాన్ని కవచంగా ధరించడమే మంచిది.
ధర్మ పదార్థాన్ని గుర్తించడం అంత సులువైన పనికాదు. అది సాదాసీదా పనికాదు. అందరికీ సాధ్యమయ్యేది కాదు. అలా అని ఊరుకుంటే మనం నిజమైన మానవులం కాదు. మనకు ఒక బాధ్యత ఉంది. ధర్మం ఉంది. మన జీవితానికి గొప్ప ధర్మ ప్రయోజనం ఉంది. అన్నింటికీ మించి పరమార్థం ఉంది. దాన్ని అంటే ధర్మాన్ని గుర్తించాలి.
స్త్రీ పురుష భేదాన్ని, విచక్షణను సనాతన ధర్మం ఏకోశాన అంగీకరించదు. ఈ ధర్మ పన్నాన్ని ఇటీవల సరిగా అనుసరించకపోవడం వల్ల సమాజంలో పెక్కు అవాంతరాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రాచీన కాలంలో స్త్రీలను గౌరవించలేదనీ, ఆధునిక యుగంలో అమితంగా గౌరవిస్తున్నామనీ కొంద రు భ్రాంతి పడుతున్నారంతే.
మనం చేస్తున్నదంతా ధర్మం కాదు. అలా అని అధర్మమూ కాదు.
ఇవన్నీ అర్థధర్మాలు. ఈ అర్ధ ధర్మాల నుంచి పూర్ణ ధర్మాల వైపు సాగిపోయేది తాత్త్వికత. మనస్సు ఏ ధర్మంతో శృతి కలుపు తుందో- దేనిమీద విశ్వాసం ఉంటుందో- అదే అత్యుత్తమ ధర్మం. ముందుగా ఆ ధర్మాన్ని గురించి వర్ణన చేసే అర్హత మనకు ఉందో లేదో కూడా మనం ఆలోచిం చాలి.
ధర్మ జ్ఞానం వల్ల జీవితంలో మిగతా సుఖాలు ఏమీ పాడైపోతాయోనని మనిషికొక వింత ఆలోచన. ఈ ప్రపంచంలోగలవేవి విడిచి పెట్టమని కాదు. అన్ని ధర్మాల్నీ విచక్షణతో ఆలోచించి నిత్యానిత్య వివేకాన్ని కలిగి ఆస్వాదించమని మాత్రమే చెప్పబడుతుంది.

– ఎస్‌ ఆర్‌ భల్లం
98854 42642

Advertisement

తాజా వార్తలు

Advertisement