Thursday, May 16, 2024

ధర్మం మర్మం (ఆడియోతో…)

పురాణాలలో గణపతి రహస్యం..

భాద్రపద శుద్ధ చవితి పూర్వాభద్ర నక్షత్రం నాడు వినాయక జననం జరిగింది. సంవత్సరానికి ఉన్న 12 నెలల్లో 12ను మూడుతో విభజిస్తే ప్రతి భాగానికి 4 నెలలు, అంటే సత్త్వము, రజస్సు, తమస్సు అనే మూడుతో 4ను గుణిస్తే 12 వస్తుంది. 4 అంటే ధర్మార్ధ కామ మోక్షములని 4 పురుషార్థాలు.

చైత్రం – ధర్మం
వైశాఖం- అర్ధం
జ్యేష్ఠం- కామం
ఆషాఢం – మోక్షం

శ్రావణం – ధర్మం
భాద్రపదం – అర్ధం
ఆశ్వయుజం – కామం
కార్తీకం – మోక్షం

మార్గశిరం – ధర్మం
పుష్యం – అర్ధం
మాఘం – కామం
పాల్గుణం – మోక్షం

- Advertisement -

ఇలా మొదటి నాలుగు సత్త్వగుణం, రెండవ నాలుగు రజోగుణం, మూడవ నాలుగు తమోగుణం. ఈ విధంగా భాద్రపద మాసం అర్ధప్రదం అంటే మన కోరికలు తీర్చేది. గణపతి అన్ని కోరికలు తీర్చేవాడు అయితే శుక్ల పక్షం కావున శుక్లం జ్ఞానాన్ని సూచిస్తుంది. మన కోరిక జ్ఞానం మీద ఉండాలి అంటే జ్ఞానాన్ని కోరాలి. వినాయకుడు జ్ఞాన ప్రదాత. ఆయన పుట్టుక చతుర్ధి అనగా 4వది, 4వ పురుషార్థం మోక్షం. అంటే రజోగుణం పెల్లుబికినా దైవ సన్నిధిలో జ్ఞానాన్ని అర్థిస్తాము. ఆ జ్ఞానంలో ‘జ్ఞానాత్‌ మోక్ష:’ అన్నట్టుగా మోక్షాన్ని పొందుతాము. ఇలా భాద్రపద శుద్ధ చవితి నాడు రజోగుణం గల మానవుడు పరమాత్మను జ్ఞానాన్ని కోరితే పరమాత్మ జ్ఞానంతో మోక్షాన్ని ప్రసాదిస్తాడు అని భాద్రపద శుద్ధ
చవితి మనకు ఉపదేశిస్తుంది. ఇక ఆయన నక్షత్రం పూర్వభాద్ర అనగా మొదలు, చివర శుభాన్ని కలిగించేది అని అర్థం. పూర్వాభాద్ర 25వ నక్షత్రం. 25వ తత్త్వం జీవ తత్త్వం అనగా పరిపూర్ణమైన జీవుడు కోరికలతో కొట్టు మిట్టాడుతూ సకల గణాలకు అధిపతి అయిన గణపతిని జ్ఞానాన్ని అర్థిస్తే ఆ పరమాత్మ జ్ఞానాన్ని మోక్షాన్ని ప్రసాదిస్తాడు అనేది పురాణాలలో వివరించిన గణపతి అవతారం రహస్యం.

Advertisement

తాజా వార్తలు

Advertisement