Tuesday, May 14, 2024

జగత్కల్యాణ కారకం సత్యదేవుని కల్యాణం

(అన్నవరం సత్యనారాయణ స్వామి కల్యాణం సందర్భంగా ఈ వ్యాసం)
”సత్యే సర్వం ప్రతిష్ఠితమ్‌” అని ఆర్యోక్తి. సకల ధర్మాలు సత్యంలోనే ఇమిడి ఉన్నాయి. ఒక్క సత్య వాక్యం సకల వేద ధర్మాల కంటె మిన్నయైనది. అది నూరు యజ్ఞాల కంటె గొప్పది. అటువంటి విశిష్టమైన సత్యవాక్పాలన చేసే భక్తులను సదా రక్షిస్త్తూ, ఆ భక్తుల కొంగు బంగారమై తానూ అలాగే ‘అన్న వరా’లన్నీ ఇచ్చే దైవం రత్నాల కొండ స్వామి అన్నవరం శ్రీసత్యనారాయణ స్వామి. సత్యస్వరూపుడు, సత్యప్రియుడు, సత్యవాక్య పాలన నిష్ఠుడు అయిన శ్రీసత్యనారాయణ స్వామి సత్యప్రియత్వాన్ని చాటడమే సత్యనారాయణ వ్రత దీక్ష పరమార్థం.
ఆంధ్రప్రదేశ్‌ తూర్పు గోదావరి జిల్లాలోని తుని – ప్రతిపాడు పట్ట్టణాల మధ్య ఈ అన్నవరం లేక రత్నగిరి ఉంది. ఇక్కడ సత్యనారాయణ స్వామి హరిహర హిరణ్యగర్భ త్రిమూర్త్యాత్మక మూర్తి కాగా అమ్మవారు అనంత లక్ష్మీ సత్యవతి! సత్యనారాయణ స్వామి కల్యాణం అన్నవరంలో వైశాఖ శుద్ధ ఏకాదశిన జరగనుంది.
కలియుగంలో జనులు, అల్పాయుష్కులు, అల్ప జ్ఞానులై ఉంటారని వారు పెద్ద పెద్ద క్రతువులు, యజ్ఞాలు చేసే శక్తిలేనివాకై ఉంటారు కనుక వారు తమ కోర్కెలను, కష్టాలను తీర్చుకునేందుకు సులభ మైన సత్యనారాయణ వ్రతం చేయవచ్చని విష్ణుమూర్తి నారద మహర్షి ఎదుట ప్రత్య క్షమై చెప్పినట్లుస్కాంద పురాణం లోని రవా ఖండం లో ఉన్న ట్టు చెబుతారు. స్వామి ఖర నామ సంవత్స రం శ్రావణ శుద్ధ విదియ (1891 ఆగస్టు 6) గురు వారం నాడు రత్న గిరిపై ఆవిర్భవిం చారని తెలు స్తోంది. అన్నవరం గ్రామా నికి చెందిన ఈరంకి ప్రకాశ రావు, రాజా ఇనుగంటి వేంకట రామారా యణం బహదూర్‌ లకు స్వామి కలలో కనిపించి తాను రత్న గిరిపై అంకుడు చెట్టు క్రింద ఒక పొదలో ఉన్నానని చెప్పడం, వారు వెళ్లి స్వామి ని కనుగొన్నారనే విషయం తెలిసిందే. స్వామి ఈ సంద ర్భంగాతాను సత్య దేవుడ ననీ, హరిహర హిరణ్యగర్భ అర్చావతార మూర్తినని తెలిపినట్టు చెబుతారు. అప్పటి నుంచి ల క్షలాది భక్తు లు ఈ క్షేత్రాన్ని దర్శించి, వ్ర తాలు చేయించుకుని స్వామి కృపకుపాత్రులై వెళుతున్నారు.
స్వామిపై మక్కువతో తిరుపతి వేంకట కవులు ఈ క్షేత్రాన్ని ఈ విధంగా వర్ణించారు.
సింహగిరి మించి, తిరుపతి సీమ మించి,
రత్నగిరి వైభవ ంబు గౌరవము హెచ్చె అని పేర్కొన్నారు. సింహాచలంలోని నృసింహ స్వామి కంటె, తిరుపతిలోని వేంకటేశ్వరుని కంటె, అన్నవరంలోని సత్యనారాయణ స్వామి ప్రఖ్యాతి క్రమంగా పెరుగుతోందని వారు పేర్కొన్నారు.
స్వామి ఈ రత్నిగిరిపై ఆవర్భవించడానికి కారణంగా ఒక పురాణ కథను చెబుతారు. దాని ప్రకారం పర్వత రాజైన వింధ్యడు (వింధ్య పర్వతం) బ్రహ్మను గురించి తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షం కాగా తనకు మహాభక్తులైన ఇద్దరు కుమారులను ప్రసాదించమని కోరాడు ఆయనకు భద్రడు. ర త్నాకరుడు అనే ఇద్ద్దరు కుమారులు కలిగారు. వారిలో భద్రుడు పర్వత రూపం దాల్చి భద్రాద్రిగా సీతారాములకు ఆవాసమై ధన్యుడయ్యాడు. రెండవ వాడైన రత్నాకరుడు శివుని గురించి తపస్సు చేసి ఆయన అనుగ్రహం పొంది అనంత లక్ష్మీ సహిత సత్యనారాయణునితో బాటు పరివార దేవతలనందరినీ తనపై నిలుపుకున్నాడు. రత్నాకరుని సోదరి ఇక్కడ పంపా నదీరూపంగా ప్రవహిస్తూ ఉందని చెబుతారు.
అపర వైకుంఠం అన్నవరం
అన్నవ రం కాలక్రమంలో ఎన్నో గోపుర ప్రాకారాలతో గొప్ప ఆలయంగా నిర్మితమైంది. ఈ ఆలయాన్ని ఇరవై నాలుగు చక్రాలతో ఉన్న మహారథం ఆకారంలో నిర్మించారని చెబుతారు. ఇక్కడ స్వామివారిని దర్శించేందుకు కొండపౖౖెకి 450 మెట్లు ఎక్కి వెళ్ళాలి. (ఇటీవలి కాలంలో బస్‌ సౌకర్యం ఉంది). ఆలయం హరిహరాత్మక తత్త్వంతో కూడినది అని తెలుసుకున్నాం. ఇక్కడ ఒక పక్క అనంతలక్ష్మీ, సత్యవతీ దేవితో కూడిన సత్యనారాయణుడు ఉండగా మరిక పక్క శివలింగ రూపంలో శివుడు కొలువై ఉన్నాడు. విష్ణు పంచాయతనం ప్రకారం స్వామికి నాలుగు వైపులా విఘ్నేశ్వరుడు, ఆది త్యుడు, అంబిక, శివుడు ప్రతిష్ఠితమయ్యారు. స్వామి వారికి త్రికాలాలలో అర్చనలు జరుగుతాయి. స్వామికి అభిముఖంగా రజిత ధ్వజ స్తంభం దివ్యకాంతులతో ప్రకాశిస్తూ భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది.
కలియుగంలో మానవులకు తమ కష్టాలను తొలగించుకునేందుకు వీలైన సులభమైన తన వ్రత విధానాన్ని స్వామి నారదునికి విన్నవించాడు. ఆ విధంగా అది భక్తులకు అందింది. గృహప్రవేశం వంటి శు భకార్యాలలో, కొన్ని పవిత్ర తిథులలో ఈ వ్రతాన్ని అచరిస్తుంటారు. నియమానుసారం వ్రతాన్ని ఆచరించిన వారు స్వామి అనుగ్రహానికి పాత్రులై అభీష్ట సిద్ధి పొందగలరని చెబుతారు. ఈ వ్రతాన్ని అన్నవరంలో స్వామి సన్నిధిలో ప్రత్యేకంగాగాని, సామూహికంగా గాని చేయడం మరింత ఫలప్రదం. సత్యనారాయణ వ్రతంలో ప్రసాద స్వీకరణ ముఖ్యం. వ్రతం చేసి ప్రసాద స్వీకరణ చేయని వారు కష్టాలు పాలైనట్లు వ్రత కథలలో ఉంది. వంటివి ఒక బ్రాహ్మణుడు, ఒక కట్టెలు కొట్టేవాడు, ఒక రాజు, కళావతి అనే మహిళ ఇలా ఎన్నో కథలు సత్యనారాయణ వ్రతానికి సంబంధించిన కథా భాగంలో ఉంటాయి.
ఈ వ్రత మహిమను గురించిన కథలు ఆదిత్య, గరుడ, స్కాందపురాణాల్లో కూడా ఉన్నా యని చెబుతారు. దుంధుమారుడు, దశరథుడు, పుత్ర సంతానం పొందటం, జనక మహారాజు అష్టైశ్వర్యాలు పొందడం వంటి కథలు కూడా ఉన్నట్లు ఇతర పురా ణాల వల్ల తెలుస్తోంది. దారిద్య్రం, కష్టాలు తొలగి, సంపదలు, కీర్తి, సత్సం తా నం, కార్యవి జయం, మోక్ష ప్రాప్తి సత్యనారాయణ వ్ర తాచరణ వల్ల సమ కూరు తాయని భక్తుల విశ్వాసం.

‘కల్యాణశ్రీ’
(జంధ్యాల వేంకటరామశాస్త్రి)
96403 21630

Advertisement

తాజా వార్తలు

Advertisement