Wednesday, May 8, 2024

అనుభూతి నుండే విభూతి స్థితి!


జోయహ పడై హనుమాన చలీసా|
హోయ సిద్ది సాఖీ గౌరీసా||
జాతి, వర్గ, వర్ణములకు అతీతంగా హనుమాన్‌ చాలీసాను ఎవరు చదివినా, వారికి వారు కోరుకున్నది లభించి తీరుతయ్‌.ఇది తులసీదాస్‌ ప్రమాణము.. కాలం నిగ్గుతేల్చిన సత్యం. అనుభవం మాత్రమే చెప్పగల పరిసత్యం.
ముందుగా, శ్రద్ధతో, విశ్వాసంతో చదవాలి.చదివిన దానిని లోతుగా అధ్యయనం చేయాలి.అధ్యయనం చేసిన దానిని అర్థం తెలుసుకుని ఆచరించాలి.ఆచరణ నుండీ అనుభవం పొందాలి.అనుభవం నుండీ అనుభూతి పొందాలి.అనుభూతి నుండీ వి భూతి స్థితిని అందుకోవాలి.ఇది క్రమంగా జరగాలి.

అర్థం తెలియక చేసే ఏ పనైనా వ్యర్థమే.
గౌరీశంకరుల సాక్షి అంటే అంతస్సాక్షి!
శంకర అంటే మంగళప్రదమైన ఆలోచన! గౌరీ అంటే ఆచరణ!
ఆలోచన మనయందే ఉన్నది. ఆచరణా మన ద్వారానే జరుగుతున్నయ్‌. కనుక గౌరీశంకరులంటే మన ఆలోచన, ఆచరణల సమన్వయ విధానమే! శ్రమిస్తేనే ఫలిస్తుంది. విశ్రమిస్తే విరమిస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement