Sunday, May 5, 2024

అకీరా నందన్ బాధ్యత త్రివిక్రమ్ దేనట?

మెగా ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలో అరడజనుకు పైగా హీరోలు ఉన్నారు. అయితే ఎంతమంది ఉన్నా ఒక్క హీరో ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. అది మరెవరో కాదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్. అకీరా నందన్ ఎంట్రీ పై ఇప్పటికే రకరకాల వార్తలు తెరపైకి వస్తున్నాయి. దానికి తోడు ఇటీవల రేణు దేశాయ్ అకీరా నందన్ కర్రసాము చేస్తున్న వీడియో ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారడం తో మరోసారి అకీరా ఎంట్రీపై వార్తలు తెరపైకి వచ్చాయి.

కాగా తాజా సమాచారం ప్రకారం… అకీరానందన్ ఎంట్రీ బాధ్యతను త్రివిక్రమ్ చేతిలో పవన్ కళ్యాణ్ పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అకీరా నందన్… పవన్ కళ్యాణ్ తో జూబ్లీహిల్స్ లో నివాసం ఉంటున్నాడు. అక్కడే మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నాడు. హీరో గా ఎంట్రీ ఇచ్చే ముందు ఇవన్నీ నేర్పించాలని ఉద్దేశంతో పవన్ ఈ నిర్ణయం తీసుకున్నాడట.

Advertisement

తాజా వార్తలు

Advertisement