Wednesday, May 15, 2024

ఆరుగురు తృణమూల్ ఎంపీలపై సస్పెన్షన్ వేటు

పార్లమెంట్ సమావేశాలకు పదే పదే అంతరాయం కలిగిస్తుండడంతో ఆరుగురు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలను రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు సస్పెండ్ చేశారు. బుధవారం సభ ప్రారంభం కాగానే పెగాసస్ వివాదంపై తృణమూల్ ఎంపీలు రచ్చ మొదలుపెట్టారు. సభ వెల్‌లోకి దూసుకెళ్లి ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు.

అందరూ వెనక్కు వెళ్లి సీట్లలో కూర్చోవాల్సిందిగా రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు సూచించారు. లేదంటే ఛైర్మన్‌ను, సభను గౌరవించని కారణంగా రూల్ 255 ప్రకారం అందరినీ బయటకు పంపించేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. అయినా వారు వెనక్కు తగ్గకపోవడంతో ఆరుగురు ఎంపీలను ఈ రోజంతా సభ నుంచి బహిష్కరించారు.

ఈ వార్త కూడా చదవండి: కాకతీయ, తెలుగు యూనివర్సిటీల వీసీలకు నోటీసులు

Advertisement

తాజా వార్తలు

Advertisement