Wednesday, May 1, 2024

హైదరాబాద్ లో స్టార్ షట్లర్.. సింధుకు ఘన స్వాగతం

టోక్యో ఒలింపిక్స్‌లో సింధు కాంస్య పతకం గెలిచాక భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు హైదరాబాద్ చేరుకుంది. సింధుకు మంత్రి శ్రీనివాస్ గౌడ్‌, శాట్స్‌ ఛైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, సైబరాబాద్ సీపీ సజ్జనార్ ఘన స్వాగతం పలికారు. అభిమానులు పెద్ద సంఖ్యలో విమానాశ్రయానికి చేరుకుని వెల్​కం చెప్పారు. సింధుకు తెలంగాణ ప్రభుత్వం తరుపున సీఎం కేసీఆర్ సత్కరించే అవకాశం ఉంది.

ఇప్పటికే పీవీ సింధుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రూ. 30 లక్షల నగదు అందించనున్నట్టు ప్రకటించింది. సింధుతో పాటు ఇటీవల కాలంలో జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో సత్తా చాటిన క్రీడాకారులందరికీ నజరానాలు వెంటనే ఇవ్వాల్సిందిగా అధికారులకు సీఎం జగన్‌ ఆదేశించిన సంగతి తెలిసిందే.

కాగా, ఒలింపిక్స్‌ బ్యాడ్మింటన్‌లో వరుసగా రెండు పతకాలు సాధించిన తొలి భారత షట్లర్‌గా సింధు రికార్డు సాధించింది. 2016 రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన సింధు…టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించింది. ఈ ఘనత సాధించిన ఏకైక భారత క్రీడాకారిణిగా ఈమె నిలిచింది. రెండు ఒలింపిక్స్ ​లో వరుసగా పతకాలు సాధించిన సింధు దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి. ప్రధాని మోదీ సహా రాజకీయ, సినీ, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు సింధు ఆటను కొనియాడారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement