Thursday, May 2, 2024

Tokyo Olympics: భారత్‌కు మరో పతకం ఖాయం

టోక్యో ఒలింపిక్స్‌లో రెజ్లర్ రవికుమార్ దహియా భారత్‌కు మ‌రో పతకం ఖాయం చేశాడు. దూకుడుగా ఆడుతూ వరుసగా విజయాలు సాధిస్తున్న అతడు.. తాజాగా ఫైనల్ చేరాడు. బుధ‌వారం జ‌రిగిన‌ సెమీఫైనల్‌లో 57 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో క‌జ‌కిస్థాన్ రెజ్ల‌ర్ నూరిస్లామ్ స‌నాయుపై అత‌డు విజయం సాధించాడు. విక్ట‌రీ బై ఫాల్‌గా రవికుమార్ దహియాను విజేత‌గా ప్ర‌క‌టించారు.

ఓ దశలో రవికుమార్ 2-9తో వెనుకబడ్డాడు, అప్పటికి మ్యాచ్ ముగిసేందుకు 30 సెకన్ల సమయం మాత్రమే మిగిలుంది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప మ్యాచ్ గెలవలేని స్థితిలో రవికుమార్ తన ప్రత్యర్థి నూర్లిసామ్ సనయేవ్ ను దొరకబచ్చుకుని ఉడుం పట్టు పట్టాడు. తద్వారా ప్రత్యర్థిని ఫాలౌట్ చేశాడు. దంగల్ సినిమా క్లైమాక్సులో గీతా ఫోగాట్ తన ప్రత్యర్థిని చివరి నిమిషంలో ఎలా చిత్తు చేస్తుందో.. ఈ పోరులో రవికుమార్ కూడా అదే చేశాడు.

ఈ విజ‌యంతో ఫైన‌ల్లో అడుగుపెట్టిన ర‌వికుమార్‌.. గెలిస్తే గోల్డ్ మెడల్, ఓడితే సిల్వర్ మెడల్ గెలుచుకోనున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కూ ఒలింపిక్స్ రెజ్లింగ్‌లో సుశీల్‌కుమార్‌, యోగేశ్వ‌ర్‌ద‌త్‌లు మాత్ర‌మే ఇండియాకు సిల్వ‌ర్ మెడ‌ల్స్ అందించారు. వాళ్ల త‌ర్వాత ఈ ఘ‌న‌త సాధించిన మూడో రెజ్ల‌ర్‌గా ర‌వికుమార్ ద‌హియా నిలిచాడు.

ఈ వార్త కూడా చదవండి: భారత్‌కు నిరాశ.. సెమీస్‌లో ఓడిన లవ్లీనా

Advertisement

తాజా వార్తలు

Advertisement