Friday, April 19, 2024

మారుతి దర్శకత్వంలో మెగాస్టార్ మూవీ?

ఈరోజుల్లో, బస్ స్టాప్, మహానుభావుడు, ప్రతి రోజు పండగే వంటి చిత్రాలతో సూపర్ డూపర్ హిట్ ని అందుకున్నాడు డైరెక్టర్ మారుతి. ప్రస్తుతం మారుతి పక్కా కమర్షియల్ సినిమా చేస్తున్నాడు. గోపీచంద్ హీరోగా తెరకెక్కుతున్న గీత ఆర్ట్స్2 బ్యానర్ లో బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఇదిలా ఉండగా మారుతి మెగాస్టార్ తో ఓ సినిమా చేయబోతున్నాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. మెగాస్టార్ చిరంజీవి కోసం మారుతి మొత్తం మూడు కథలను రాసుకున్నాడట.

ఈ మధ్యనే ఆ మూడు కథలను చిరంజీవికి వినిపించగా అందులో ఒక కథ కు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. అయితే అన్ని అనుకున్నవి అనుకున్నట్టుగా జరిగితే… గీతాఆర్ట్స్ బ్యానర్ లోనే ఈ సినిమాను తెరక్రెక్కే అవకాశమున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రానుందని సమాచారం. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తున్నాడు. దీని తరువాత లూసిఫర్, వేదాళం రీమేక్ లలో నటించబోతున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement