Thursday, May 16, 2024

TS: BRS ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డికి హైకోర్టు నోటీసులు

భారత్ రాష్ట్ర సమితి (BRS) పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలకు నోటీసులు వ‌చ్చాయి. ఎన్నికను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారించిన న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిలకు నోటీసులు ఇచ్చింది. వేర్వురు పిటిషన్లను విచారించిన న్యాయస్థానం ఈ మేరకు నోటీసులు జారీ చేసింది.

గత అసెంబ్లీ ఎన్నికల నామినేషన్‌ సందర్భంగా తప్పుడు వివరాలతో అఫిడవిట్‌ సమర్పించిన మల్లారెడ్డి ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసిన తోటకూర వజ్రేష్‌ యాదవ్‌ ఇటీవల హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ జె.శ్రీనివాస్‌ రావులతో కూడిన సింగల్ బెంచ్ ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది సిద్ధార్థ్‌ పోగుల వాదనలు వినిపిస్తూ.. రిటర్నింగ్‌ అధికారికి చామకూర మల్లారెడ్డి తప్పుడు అఫిడవిట్‌ సమర్పించారన్నారు. సూరారం గ్రామంలో కొంత భూమి ఉందని అఫిడవిట్‌లో పేర్కొన్నారని.. రికార్డుల ప్రకారం అది ప్రభుత్వ భూమి, నాలాగా ఉందని వాదనలు వినిపించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement