Friday, May 3, 2024

హరిహారవీరమల్లు అప్డేట్ రెడీ ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రేజీ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం హరిహర వీరమల్లు. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే పవన్ కళ్యాణ్ బంది పాటుగా కనిపించనున్నారు. ఇక ఇప్పటికే విడుదలైన లుక్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఇలా ఉండగా పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన కొత్త లుక్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయబోతున్నారట.అలాగే ఈ చిత్రం తాలూకా సరికొత్త రిలీజ్ డేట్ ని కూడా రిలీజ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఈసినిమాకు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement