Saturday, April 27, 2024

పాగల్ ట్రైలర్ @ లవర్ బాయ్ గా విశ్వక్ సేన్

ఈ నగరానికి ఏమైంది, ఫలక్ నూమా దాస్ వంటి చిత్రాలతో యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు విశ్వక్ సేన్. ప్రస్తుతం విశ్వక్ సేన్ పాగల్ సినిమా చేస్తున్నాడు. నరేష్ కుప్పిలి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా… ఇప్పటికే ఈ సినిమాకు మంచి మార్కెట్ ఏర్పడగా… టీజర్, సాంగ్ తో అది మరింత ఎక్కువ ఏర్పడింది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

టైలర్ చూడటానికి ఎంతో ఆసక్తికరంగా అనిపిస్తుంది. అంతేకాకుండా గత సినిమాలతో పోలిస్తే స్టైలిష్ గా కూడా విశ్వక్ సేన్ కనిపించారు. ఇందులో సిల్లీ లవర్ బాయ్ గా విశ్వక్ సేన్ కనిపించబోతున్నాడు. ఇక నివేద పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే సిమ్రాన్ చౌదరి కూడా ఈ సినిమాలో నటిస్తోంది. ఆగస్టు 14న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు రాధన్ సంగీతం అందిస్తున్నారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement