Sunday, May 5, 2024

రేవంత్‌రెడ్డి కాళ్లు, చేతులు నరుకుతాం: జోగురామన్న

ఇంద్రవల్లి దళిత దండోరా సభలో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే జోగురామన్న విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ఆయన రేవంత్‌రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, బీజేపీ చీకటి ఒప్పందంలో భాగంగా ఇంద్రవెల్లి సభ జరిగిందన్నారు. ఆ రెండు పార్టీలకు ప్రజలు బుద్ది చెప్పే రోజు ఎంతో దూరంలో లేదన్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన పగటి దొంగ రేవంత్‌కు తగిన శాస్తి జరిగే రోజు ముందే ఉందని జోగురామన్న ఆరోపించారు.

ఇప్పటికైనా రేవంత్‌రెడ్డి అబద్దాలు చెప్పడం మానుకోవాలని హితవు పలికారు. లేకపోతే కాళ్లు, చేతులు నరికి పంపిస్తామని జోగురామన్న హెచ్చరించారు. దళిత, గిరిజనులకు కాంగ్రెస్ పార్టీ చేసిందేమీ లేదన్నారు. నాగోబా జాతరకు నిధులిచ్చి ఘనంగా నిర్వహిస్తోంది టీఆర్ఎస్ ప్రభుత్వమే అని తెలిపారు. గతంలో గిరిజన ,ఆదివాసీ పండగలను సంస్కృతిని నిర్లక్ష్యం చేసిన కాంగ్రెస్ పార్టీనే ఇప్పుడు వచ్చి గొప్పలు చెప్పుకుంటోందని జోగురామన్న విమర్శించారు. పోడు భూముల సమస్య పరిష్కారం కరోనా వల్ల కొంత ఆగిందన్నారు. దరఖాస్తులు ప్రభుత్వం వద్ద ఉన్నాయని.. త్వరలోనే అవి పరిష్కారమవుతాయి అని తెలిపారు. దళిత, గిరిజన, ఆదివాసీ కుటుంబాలకు వెలుగునిచ్చింది, ఇచ్చేది కేసీఆర్ మాత్రమే అని జోగు రామన్న పేర్కొన్నారు.

ఈ వార్త కూడా చదవండి: ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ 13 చోట్ల మినీ పట్టణాలు

Advertisement

తాజా వార్తలు

Advertisement