Sunday, April 14, 2024

RS ప్రవీణ్ కుమార్‌కు కరోనా పాజిటివ్

బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కో-ఆర్డినేటర్, మాజీ ఐపీఎస్ ఆఫీసర్ RS ప్రవీణ్ కుమార్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో చేరిన ఆయనకు డాక్టర్లు కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్ నిర్ధారణ అయింది. అయితే ప్రస్తుతం ప్రవీణ్ కుమార్ ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు.

కరోనా లక్షణాలు స్వల్పంగా ఉండటంతో హోం ఐసోలేషన్‌కు పంపనున్నట్లు పేర్కొన్నారు. ప్రవీణ్ కుమార్ 2 రోజుల క్రితం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి, బీఎస్పీలో చేరారు. దీంతో ఆయనను ఇటీవల కలిసిన వారంతా కూడా పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement