Sunday, May 5, 2024

ఆర్ఆర్ఆర్ రికార్డ్ బ్రేక్ చేసిన వాలిమై

తమిళ్ స్టార్ హీరో అజిత్ నటిస్తున్న వాలిమై సినిమా ఫస్ట్ లుక్ ఆదివారం విడుదలైన సంగతి తెలిసిందే. ఫస్ట్ లుక్ తో పాటు మోషన్ పోస్టర్ ని కూడా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. వినోద్ దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రంకు సంబంధించిన ఫస్ట్ లుక్ కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు.

అయితే సోషల్ మీడియాలో వాలిమై ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పటి నుంచి రికార్డ్స్ బ్రేక్ చేస్తుండగా… తాజాగా ఆర్ ఆర్ ఆర్ సినిమా రికార్డును బ్రేక్ చేసింది. ఆర్ ఆర్ ఆర్ ఫస్ట్ లుక్ కు 16 గంటల్లో 463కే లైక్స్ రాగా వాలిమైకు వన్ మిలియన్ ప్లస్ లైక్స్ వచ్చాయి. ఇక ఇదే విషయమై అజిత్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement