Saturday, April 27, 2024

ప్రైమ్ చరిత్రలోనే వకీల్ సాబ్ రికార్డు..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో పవన్ స్టైల్ కు ఆయన చెప్పిన డైలాగ్స్ కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. పవన్ కు ఈ సినిమా పర్ఫెక్ట్ కంబ్యాక్ అనే చెప్పాలి. ఏప్రిల్ 30 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘వకీల్ సాబ్’ చిత్రాన్ని రిలీజ్ చేశారు.

వకీల్ సాబ్’ థియేట్రికల్ రన్‌కు త్వరగా తెరపడ్డప్పటికీ.. కొన్ని రోజుల్లోనే ఈ సినిమా ఓటీటీ బాట పట్టడంతో ఇప్పుడు మళ్లీ సామాజిక మాధ్యమాలన్నీ ‘వకీల్ సాబ్’ ముచ్చట్లతో నిండిపోతున్నాయి. థియేటర్లలో ఈ సినిమాను మిస్సయిన వాళ్లతో పాటు ఆల్రెడీ థియేటర్లలో చూసిన వాళ్లు కూడా విరగబడి ‘అమేజాన్ ప్రైమ్’లో ఈ సినిమాను చూస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. మామూలుగా ఫ్యాన్ మూమెంట్స్ ఉన్న సినిమాలకు రిపీట్ ఆడియన్స్ వస్తుంటారు. ‘వకీల్ సాబ్’ను కూడా తొలి రెండు వారాల్లో అలా అభిమానులు మళ్లీ మళ్లీ చూశారు. ఐతే ఈ సినిమాకు సెకండ్ వీకెండ్ అయ్యేసరికే కరోనా కరాళ నృత్యం చేస్తుండటంతో థియేటర్లకు వెళ్లడం తగ్గించేశారు. ఐతే ఇప్పుడు అమేజాన్ ప్రైమ్‌లో ఫ్యాన్స్ సినిమాను మళ్లీ మళ్లీ చూస్తున్నారు. తమకు నచ్చిన సన్నివేశాలను బాగా ఆస్వాదిస్తున్నారు. మహిళలు, ఫ్యామిలీ ఆడియన్స్ ‘వకీల్ సాబ్’కు పట్టం కడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రైమ్ చరిత్రలోనే అత్యధిక వ్యూస్ తెచ్చుకున్న భారతీయ చిత్రాల్లో ఒకటిగా ‘వకీల్ సాబ్’ రికార్డుల్లోకి ఎక్కే అవకాశాలు లేకపోలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement