Saturday, May 8, 2021

సీఎమ్మార్ఎఫ్ పేదలకు వరప్రదాయిని..

ఉర్కొండ : సీఎమ్మార్ఎఫ్ పేదలకు వరప్రదాయిని అని సర్పంచ్ తలసాని అనిల్ రెడ్డి అన్నారు. మండలంలోని జకినాలపల్లి గ్రామానికి చెందిన సీఎమ్మార్ఎఫ్ లబ్ధిదారులు సీతమ్మకు రూ.50,000 , పూణ్య నాయక్ కు రూ.12,000, కవిత కు రూ.14,500 సీఎమ్మార్ఎఫ్ చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ తలసాని అనిల్ రెడ్డి మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ పేదల అభ్యున్నతికి ఎంతో కృషి చేస్తున్నారని, అందులో భాగంగానే అనేక రకాల సంక్షేమ పథకాలను రూపొందించిన వాటిని అమలు చేస్తున్న ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ భాస్కర్, టిఆర్ ఎస్ నాయకులు పోలే శంకర్, లబ్ది దారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News