Saturday, April 27, 2024

పవన్ ట్రెండ్ ఫాలో అవ్వడు…సెట్ చేస్తాడు – ఇదే సాక్ష్యం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం వకీల్ సాబ్. హిందీలో అమితాబ్ నటించిన పింక్ సినిమాకు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. లాంగ్ గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉండగా సోమవారం సాయంత్రం 6 గంటలకు ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను చిత్ర యూనిట్ థియేటర్స్ లో రిలీజ్ చేసింది.

కాగా ఈ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. రిలీజ్ అయిన 24 గంటల్లోనే 1 మిలియన్ లైక్స్ తో టాలీవుడ్ లోనే సరికొత్త రికార్డును సృష్టించింది. ఇదే విషయంపై పవన్ కళ్యాణ్ ఫాన్స్ సోషల్ మీడియా వేదికగా రక రకాల పోస్టులు పెడుతున్నారు. పవర్ స్టారా మజాకా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

లైక్స్ విషయం లో చూసుకుంటే:

50K in 3 Min

100K in 6 Mins
150K in 12 Mins
200k Likes in 19Mins
250k Likes In 29Mins
300k likes in 39Mins
350k Likes In 55Mins
600K Likes in 3 hours 3 mins
800k Likes in 13 hours 17 mins
1 Million Likes in 23hrs 39mins

Advertisement

తాజా వార్తలు

Advertisement