Friday, April 26, 2024

డబ్బింగ్ చెబుతున్న పవన్…ఫొటోస్ వైరల్

లాంగ్ గ్యాప్ తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో ప్రేక్షకులముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. హిందీలో బిగ్ బి అమితాబ్ నటించిన పింక్ సినిమాకు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు బోనికపూర్ సంయుక్తంగా నిర్మించారు. కాగా ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే రిలీజ్ అయిన లుక్స్, టీజర్, సాంగ్స్ సినిమాపై మరింత అంచనాలు పెంచాయి. ఏప్రిల్ 9న ఈ సినిమా థియేటర్ లో సందడి చేయబోతోంది.

ఈ నేపథ్యంలోనే పవన్ డబ్బింగ్ పూర్తి చేశారు. హైదరాబాదులోని శబ్దాల థియేటర్ లో పవన్ డబ్బింగ్ చెప్పారు. డబ్బింగ్ చెబుతున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమాలో పవన్ సరసన గబ్బర్ సింగ్ బ్యూటీ శృతిహాసన్ నటిస్తోంది. అలాగే నివేదాథామస్, అంజలి ,అనన్య కీలక పాత్రలో నటిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement