Saturday, November 30, 2024

AP: అమ్మవారి ఆలయ స్వర్ణ తాపాడానికి రూ.10 లక్షల విరాళం..

(ఎన్టీఆర్ ప్రభ న్యూస్ బ్యూరో) : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో కొలువై ఉన్న కనకదుర్గమ్మ వారి ఆలయ స్వర్ణ తాపడం కోసం ఒక భక్తుడు భారీ విరాళాన్ని అందజేశారు. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో అమ్మవారి ఆలయానికి డొనేషన్లు ఇచ్చే దాతల కోసం ప్రత్యేకంగా డోనర్ సెల్ ను శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు.

డోనార్ సెల్ ప్రారంభమైన అనంతరం శ్రీ అమ్మవారి ఆలయం స్వర్ణ తాపడం పనుల కోసం విజయవాడకు చెందిన దాత కడియాల వంశీకృష్ణ, పద్మజలు రూ.10,00,000లు (అక్షరాలా పది లక్షల రూపాయలు) విరాళాన్ని ఆలయ ఈవో కె.ఎస్ రామరావు చేతుల మీదుగా దేవస్థానంకు అందజేయగా, ఆలయ అధికారులు వీరికి మంగళ వాయిద్యముల నడుమ స్వాగతం పలికి, కనక దుర్గమ్మ దర్శనం కల్పించి, వేదపండితులచే వేదాశీర్వచనం కల్పించి, అమ్మవారి ప్రసాదములు, శేష వస్త్రం చిత్రపటం అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement