Wednesday, May 8, 2024

ముచ్చటగా మూడవది స్టార్ట్ చేసిన వైష్ణవ్ తేజ్

వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమాతో సూపర్ డూపర్ హిట్ ని అందుకున్న సంగతి తెలిసిందే. దీంతోపాటు క్రిష్ దర్శకత్వంలో చేస్తున్న మరో సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ఇంకా ఫిక్స్ కాలేదు. కాగా వైష్ణవ్ తేజ్ తన మూడో సినిమా షూటింగ్ స్టార్ట్ చేశాడు. గిరీశాయ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.

కేతికశర్మ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పటికే విడుదల చేయగా షూటింగ్ మాత్రం తాజాగా ప్రారంభమైంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అలాగే దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement