Friday, April 19, 2024

ఊగిసలాటలో చివరికి లాభాలు..

దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా ప్రతికూలంగా ఉన్నప్పటికీ.. దేశీయంగా వెల్లువెత్తిన కొనుగోళ్ల అండతో దూసుకెళ్లయి. ఈరోజు సూచీలు ఉత్సాహంగా ట్రేడింగ్ ను ప్రారంభించిన మార్కెట్లు…ఒకానొక సమయంలో సెన్సెక్స్ 54,780 పాయింట్లను తాకింది. అయితే ఆ తర్వాత ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో సూచీలు ఒత్తిడికి గురయ్యాయి. చివరకు సెన్సెక్స్ 152 పాయింట్లు లాభపడి 54,555 వద్ద ముగిసింది. నిఫ్టీ 22 పాయింట్లు పెరిగి 16,280 వద్ద స్థిరపడింది. బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ గా భారతి ఎయిర్ టెల్ (3.84%), టెక్ మహీంద్రా (2.81%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (1.85%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (1.80%), మహీంద్రా అండ్ మహీంద్రా (1.48%). టాప్ లూజర్స్ లిస్ట్ లో టాటా స్టీల్ (-2.73%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-2.21%), ఎన్టీపీసీ (-2.14%), ఐటీసీ (-1.85%), బజాజ్ ఆటో (-1.64%) ఉన్నాయి.

ఇది కూడా చదవండి : టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్?

Advertisement

తాజా వార్తలు

Advertisement