Friday, May 3, 2024

థియేటర్‌లో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో ట్రెండింగ్

ఉపేంద్ర, శ్రియ శరణ్ ప్రధాన పాత్రలలో నటించిన పాన్ ఇండియన్ చిత్రం కబ్జా. అయితే ఈ సినిమా కేజిఎఫ్ స్టోరీకి దగ్గరగా ఉండటంతో అన్ని భాషలలో భారీ ఫ్లాప్ గా నిలిచింది. కాగా, థియేట్రికల్ రన్ తర్వాత, ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. తాజా వార్త ఏమిటంటే, థియేటర్స్ లో అట్టర్ ఫ్లాఫ్ అయిన ఈ మూవీ OTT ప్లాట్‌ఫారమ్‌లో అత్యధిక వ్యూయర్‌షిప్‌ తో దూసుకుపోతుంది. అంతే కాకుండా అమెజాన్ ప్రైమ్ వీడియో ట్రెండింగ్‌ లిస్ట్ లో టాప్ స్పాట్‌లో ఉంది.

కాగా, ఇటీవలే మేకర్స్ కబ్జా 2 షూటింగ్ కూడా ప్రారంభించారు. ఆర్ చంద్రు కబ్జా మూవీకి దర్శకత్వం వహించి, నిర్మించగా.. ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరోలు కిచ్చా సుదీప్, శివ రాజ్‌కుమార్ కీలక పాత్రలు పోషించారు. మురళీ శర్మ, సుధ, జాన్ కొక్కెన్, సుధ, అనూప్ రేవణ్ణ ఇతర కీలక పాత్రలు పోషించారు. కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ మ్యూజిక్ అందించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement