Thursday, May 2, 2024

Weather | ఉగ్రభానుడి భయం.. బెంగాల్​లో వారం రోజులు స్కూళ్లు, కాలేజీల మూసివేత

అన్ని సీజన్​ల కంటే ఈ వేసవి చాలా టఫ్​గా ఉంది.. ఫిబ్రవరి రెండో వారం నుంచి మొదలైన ఎండలు, మార్చిలో కాస్త నెమ్మదించాయి.. అయితే.. ఏప్రిల్ కు వచ్చేసరికి భానుడు భగభగమంటున్నాడు. సూర్య ప్రతాపం పీక్స్ కి చేరింది. సాధారణంగా మే నెలలో భానుడి భగభగలు తీవ్రస్థాయికి చేరతాయి. కానీ, ఈసారి దేశంలోని అనేక ప్రాంతాల్లో ముందుగానే ఎండలు మండిపోతున్నాయి.

తెలంగాణలో పలు జిల్లాల్లో మధ్యాహ్నం టెంపరేచర్లు 39 నుంచి 42 డిగ్రీలను దాటేస్తున్నాయి. ఇక.. పశ్చిమ బెంగాల్ లోనూ నిప్పులు చెరిగే ఎండలకు ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోవడంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. స్కూళ్లకు, కాలేజీలకు వారం రోజుల పాటు సెలవులు ప్రకటించింది. కొన్నిరోజులుగా ఎండలు ముదరడంతో స్కూళ్ల నుంచి తిరిగొచ్చిన పిల్లలు తలనొప్పితో బాధపడుతున్న ఘటనలు ఎక్కువవుతున్నాయని సీఎం మమతా బెనర్జీ వెల్లడించారు.

ప్రైవేటు విద్యాసంస్థలు తమ ఆదేశాలను పాటించాలని, త్వరలోనే దీనిపై కీలక నిర్ణయం ప్రకటిస్తామని ప్రభుత్వ అధికారులు తెలిపారు. అంతేకాకుండా ప్రజలు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇళ్లకే పరిమితం కావాలని, బయటికి వెళ్లొద్దని సూచించారు. బెంగాల్ లో కొన్నిరోజులుగా పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement