Thursday, May 2, 2024

మ‌ళ్లీ వచ్చేస్తున్న అన్‌స్టాపబుల్.. ఆహాలో బాలకృష్ణ సంద‌డే సంద‌డి

ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో బాలకృష్ణ హోస్ట్ గా చేసిన అన్‌స్టాపబుల్ టాక్ షో ఎంత సూపర్ హిట్ అయిందో అందరికి తెలిసిందే. సీజన్ 1, సీజన్ 2 రెండూ కూడా 20 ఎపిసోడ్స్ గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. టాక్ షోలలో ఏ ఓటీటీకి రాని వ్యూస్, రికార్డులు బాలయ్య సృష్టించారు. అన్‌స్టాపబుల్ విత్ NBK సరికొత్త రికార్డులని సృష్టించడమే కాక.. బాలయ్యబాబులోని ఇంకో కోణాన్ని చూపిస్తూ బోలెడంత మంది స్టార్స్ ని తీసుకొచ్చి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు.

అన్‌స్టాపబుల్ విత్ NBK షోకి ఎవరూ ఊహించలేనివిధంగా మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ప్రభాస్, రవితేజ, అల్లు అర్జున్, నాని.. ఇలా చాలామంది స్టార్ హీరోలతో పాటు పలువురు హీరోయిన్స్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, రాజకీయ నాయకులు వచ్చి అభిమానులకు ఫుల్ ఎంట‌ర్టైన్మెంట్ ఇచ్చారు.

ఇక ఈ షోకి సీజన్ 3 కూడా ఉంటుందని గతంలోనే వార్తలు వచ్చాయి. తాజాగా ఆహా ఓటీటీ దీనిపై క్లారిటీ ఇస్తూ బాలయ్య బాబుతో అన్‌స్టాపబుల్ సీజన్ 3 ఉందని ప్రకటించింది. గత అన్‌స్టాపబుల్ స్పెషల్ మూమెంట్స్ తో ఓ వీడియోని షేర్ చేసింది. దీంతో త్వరలోనే అన్‌స్టాపబుల్ సీజన్ 3 మొదలవ్వొచ్చని తెలుస్తుంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement