Wednesday, May 15, 2024

Karimnagar – ద‌ళితుల జీవితాల్లో వెలుగులు నింప‌డ‌మే కెసిఆర్ లక్ష్యం – మంత్రి గంగుల

క‌రీంన‌గ‌ర్ – సమైక్య పాలకులు దళితులను ఓటు బ్యాంకుగా వాడుకుని… వారి సంక్షేమాన్ని విస్మరించారని రాష్ట్ర బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కొత్తపల్లి మండలంలోని చింతకుంటలో 8 కోట్ల రూపాయలతో… ఎకరన్నర స్థలంలో… విశాలంగా నిర్మించి అంబేద్కర్ భవన్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరై… మాట్లాడుతూ..అనాదిగా దళితులు ఆర్థికంగా… సామాజికంగా… రాజకీయంగా వెనక్కి నెట్టి వేయబడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ… స్వయం పాలనలో… దళితుల్లో జీవితాల్లో వెలుగులు నింపేందుకు సిఎం కెసిఆర్ చర్యలు తీసుకుంటున్నారన్నారు.

కరీంనగర్ లో నిర్మించిన అంబేద్కర్ భవనం… గొప్ప క్షేత్రంగా మారి… దళితులకు అండగా నిలువాలని ఆకాంక్షించారు. దళిత బిడ్డలు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని… ఆర్థికంగా… సామాజికంగా… రాజకీయంగా బలోపేతం కావాలని పిలుపునిచ్చారు. సిఎం కెసిఆర్ తోనే అభివృద్ది సాధ్యమని… మరోసారి బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలన్నారు.అన్ని వర్గాల కోసం డాక్టర్ బిఆర్. అంబేద్కర్ ముందు చూపుతో… గొప్పగా రాజ్యంగాన్ని రచించారని… గడిచి 75 సంవత్సరాలుగా ఆ రాజ్యాంగమే మార్గదర్శకంగా… దేశంలో పాలన కొనసాగుతుందన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే స్వరాష్ట్రం సిద్దించిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ మహానీయున్ని గౌరవించుకునేందుకు తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్ పేరును పెట్టడంతో పాటు… పక్కనే 120 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. మహానీయుడు అంబేద్కర్ ఏ ఒక్క కులానికో… మతానికో చెందిన వారు కాదని… ఆయన ఈ దేశానికి ఆస్తి అన్నారు. అనాదిగా రాజకీయంగా… సామాజికంగా… ఆర్థికంగా వెనుకబడిన దళిత కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు దళితబంధు పథకాన్ని ప్రవేశ పెట్టామన్నారు. దళితులకు ఒక వేదిక ఉండాలని భావించి… నేనే ముందుండి అంబేద్కర్ భవనాన్ని నిర్మించి ఇచ్చానన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement