Monday, July 26, 2021

పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్న టక్ జగదీష్

నాచురల్ స్టార్ నాని హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ స్పీడ్ లో ఉన్నాడు. ప్రస్తుతం శివ నిర్మాణ దర్శకత్వంలో టక్ జగదీష్ సినిమా చేస్తున్నాడు. అలాగే శ్యామ్ సింగ రాయ్, అంటే సుందరానికి సినిమా చేస్తున్నాడు నాని. ఇందులో టక్ జగదీష్ రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఇదిలా ఉండగా అసలు విషయానికొస్తే టక్ జగదీష్ సినిమాలో నాని సరసన రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుపుకుంటుంది. అలాగే థియేటర్స్ పూర్తిస్థాయిలో ఓపెన్ అయిన తర్వాత ఆగస్టులో ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట దర్శకనిర్మాతలు. మరి ఈ సినిమాతో నాని ఎలాంటి హిట్ ను కొడతారో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News