Sunday, May 12, 2024

త్రివిక్రమ్ మహేష్ సినిమా అప్డేట్ – బాలీవుడ్ స్టార్ కూడా ?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో సినిమా చేయబోతున్నాడని గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ తన 30వ చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్నట్లు ప్రకటించాడు. అయితే త్రివిక్రమ్ ఇప్పుడు మహేష్ బాబు తో సినిమా చేయబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాను జూన్ లో మొదలుపెట్టి… అక్టోబర్ నాటికి పూర్తి చేసేటట్లు త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడట. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ నటించబోతున్నాడని తెలుస్తోంది. అంతేకాకుండా రాజకీయాలను కూడా త్రివిక్రమ్ ఈ సినిమాలో టచ్ చేయబోతున్నాడట.

ఇక ఈ సినిమాలో మహేష్ సరసన ఇద్దరు హీరోయిన్స్ ఉండనున్నారని తెలుస్తోంది. అందులో ఒక హీరోయిన్ గా కీయరా అద్వానీ ని తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement