Wednesday, May 8, 2024

చేయాల్సిన పాత్ర‌లు ఇంకా ఉన్నాయ్ – ప్రియ‌మ‌ణి

హీరోయిన్ ప్రియ‌మ‌ణి భామాక‌లాపం అనే వెబ్ సిరీస్ లో న‌టించింది. ఈ వెబ్ సిరీస్ ఫిబ్ర‌వ‌రి 11న ఆహా ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వెబ్ సిరీస్ కు ప్రేక్ష‌కుల నుండి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.అయితే తాజాగా ప్రియమణి నటిగా నాకింకా ఆకలి తీరలేదు చేయాల్సిన పాత్రలు ఇంకా చాలా ఉన్నాయి. ఫుల్‌ లెంగ్త్ నెగటివ్ రోల్ చేయాలని కోరికగా ఉంది. ఇప్పటికే కొంతమంది కథలను కూడా వినిపించారు. చెప్పగానే కథ నచ్చితే కచ్చితంగా ఒప్పుకుంటాను అని ప్రియమణి చెప్పింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా మారిన ప్రియమణి ఆ తర్వాత మాత్రం ఆ రేంజ్ విజయాలను సాధించడం లో కాస్త డీలా పడింది. ఇది ఇలా ఉంటే ప్రియమణి కొన్ని రోజుల క్రితం విడుదలైన నారప్ప సినిమాలో నటించింది. ఇలా సినిమాలు మాత్రమే కాకుండా ప్రియమణి టీవీ షోల ద్వారా కూడా అనేకమంది బుల్లితెర అభిమానులను సంపాదించుకుంది. అలాగే ప్రియమణి ఫ్యామిలీ మాన్ వెబ్ సిరీస్ ద్వారా కూడా మంచి పాపులారిటీని సంపాదించుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement