Thursday, May 16, 2024

Crime: కల్లూరులో దారుణం.. భార్య, కూతురుని కడతేర్చిన కర్కోటకుడు

అనంతపురం జిల్లా కల్లూరులో దారుణం జరిగింది. 3 సంవత్సరాల కూతురిని, కట్టుకున్న భార్యని భర్త దారుణంగా హత్య చేశాడు. వివరాల్లోకి వెళితే.. కల్లూరులో నివాసం వుండే వరుణ్…తన భార్య చంద్ర కల(పుష్ప) మధ్య గత కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో నిన్న రాత్రి అభం శుభం తెలియని మూడు సంవత్సరాల కూతురు మోక్షతను కడతేర్చి అనంతరం భార్యని హత్య చేశాడు. తన భార్యే కూతురుని చంపి ఆత్మహత్య చేసుకుందని క్రియేట్ చేశాడు. అయితే, ఈ ఘటనపై కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. అసలు విషయం గుర్తించారు. పోలీసుల కౌన్సెలింగ్ లో అసలు విషయం బయటకి రావడంతో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. వరుణ్.. అతడి తండ్రిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement