Saturday, April 27, 2024

‘పెళ్లి సందD’ నుంచి మరో సాంగ్

రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన పెళ్లి సందడి సినిమాకు సీక్వెల్ గా పెళ్లి సందD సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన నువ్వంటే నాకు ధైర్యం… నువ్వంటే నాకు సర్వం అనే పాటను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

ఈ పాటను చంద్రబోస్ రాయగా హరిచరణ్, శ్వేతా పండిట్ ఆలపించారు. ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. అలాగే గౌరీ రోణంకి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రోషన్ కి జోడీగా శ్రీలీల నటిస్తున్నారు. అప్పుడు 25 సంవత్సరాల క్రితం శ్రీకాంత్ రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన పెళ్లిసందడి సినిమా సూపర్ డూపర్ హిట్ ను అందుకుంది. ఇప్పుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ తో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement