Friday, April 19, 2024

సంక్రాంతికే ‘హరిహర వీరమల్లు’..ఇది ఫిక్స్..!

టాలీవుడ్ లో కరోనా కారణంగా చాలా సినిమాల షూటింగులు వాయిదాపడ్డాయి. అలాగే విడుదల తేదీలను కూడా వాయిదా వేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ‘హరిహర వీరమల్లు’ కూడా సంక్రాంతికి రాకపోవచ్చనే ఒక టాక్ వినిపిస్తోంది. ఈ విషయంపై ఎ.ఎమ్.రత్నం స్పందిస్తూ .. ” సంక్రాంతికి ఇంకా చాలా సమయం ఉంది .. ఇక క్రిష్ తాను అనుకున్న సమయానికంటే ముందుగానే షూటింగు పూర్తి చేసే దర్శకుడు. అందువలన ‘హరిహర వీరమల్లు’ విడుదలను వాయిదా వేసే పరిస్థితి రాదు. సంక్రాంతికి ఈ సినిమా థియేటర్లలో ఉంటుంది” అని చెప్పుకొచ్చారు. దీంతో సంక్రాంతి కి తమ అభిమాన హీరో మరోసారి రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమని పవన్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కల్యాణ్ ఈ సినిమాలో వజ్రాల దొంగగా కనిపించ నున్నాడు. ఈ సినిమాకి, ఎ.ఎమ్.రత్నం నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇక పవన్ థానాయకుడిగా ప్రస్తుతం సాగర్.కె చంద్ర దర్శకత్వంలో మరో మూవీ కూడా తెరకెక్కబోతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement