Saturday, April 27, 2024

RRR మేకింగ్ వీడియో మజాకా !! నయా ట్రెండ్

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న చిత్రం ఆర్ఆర్ఆర్. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా కనిపించబోతున్నాడు. అలాగే ఎన్టీఆర్ కొమరం భీమ్ గా కనిపించబోతున్నాడు. మరోవైపు బాలీవుడ్ స్టార్ నటుడు అజయ్ దేవగన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

తాజాగా చిత్ర యూనిట్ ఓ మేకింగ్ వీడియోను రిలీజ్ చేసింది. ఈ మేకింగ్ వీడియో సోషల్ మీడియాలో రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది. మొదటి నిమిషానికే మంచి రెస్పాన్స్ ను ఈ మేకింగ్ వీడియో తెచ్చుకుంది. అలాగే గంటల వ్యవధిలోనే యూట్యూబ్ నెంబర్ వన్ ట్రెండింగ్ లో చేరిపోయింది. 24 గంటలు పూర్తి కాకముందే… ఆరు మిలియన్ లకు పైగా వ్యూస్ ని సాధించి దూసుకుపోతోంది. ఇది ఆర్ఆర్ఆర్ కి ఉన్న క్రేజ్ అనే చెప్పాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement