Friday, April 26, 2024

బాలికను రక్షించడానికి వెళ్లి బావిలో పడ్డ 40 మంది..

మధ్యప్రదేశ్‌లోని విధిషా జిల్లాలో దారుణం జరిగింది. ప్రమాదవశాత్తు బావిలో పడ్డ బాలికను రక్షించే క్రమంలో 40 మంది బావిలో పడ్డారు..ధిషా సమీపంలోని గంజ్ బసోడాలో గురువారం సాయంత్రం ఓ ఎనిమిదేండ్ల బాలిక ఆడుకుంటూ బావిలో పడిపోయింది. దీంతో ఆ చిన్నారిని రక్షించడానికి పలువురు గ్రామ‌స్తులు బావి వద్ద నిలబడ్డారు. అయితే ఒకే సారి ఎక్కువ మంది బావి గొడలకు ఒరగడంతో ఒత్తడికి ఆ గోడ కూలింది. దీంతో సుమారు 40 మంది బావిలో పడిపోయారు. అయితే వెంటనే వారిని క్షించడానికి అధికారులు, జాతీయ విపత్తు నిర్వహణ బృందం (ఎన్‌డీఆర్‌ఎఫ్‌) సహాయక చర్యలు ప్రారంభించారు. అర్ధరాత్రి వరకు 23 మందిని రక్షించారు. వారిలో 13 మందిని దవాఖానకు తరలించారు. నలుగురు మృతి చెందారు. మొదట బావిలో పడ్డ చిన్నారిని ఇంకా బయటకు తీయలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. సహాయకచర్యలు ఇంకా కొనసాగుతున్నాయని చెప్పారు. ఈమేరకు సీఎం ట్వీట్ చేశారు.

ఇది కూడా చదవండి: కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిపై గెజిట్లు విడుదల

Advertisement

తాజా వార్తలు

Advertisement