Monday, March 25, 2024

బాలీవుడ్ టు బంజారా హిల్స్ @సోనూసూద్

లాక్ డౌన్ సమయం లో ఎంతోమంది పేద ప్రజలకు సహాయం చేసి రియల్ హీరో అనిపించుకున్నాడు బాలీవుడ్ నటుడు సోనూ సూద్. సహాయం అని అడిగిన ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ వలసకూలీలను స్వగ్రామాలకు తరలించి వారి పాలిట దేవుడయ్యాడు. ఇక సెకండ్ వేవ్ సమయంలో ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసి ప్రాణదాతగా నిలిచాడు.

అయితే ఈ బాలీవుడ్ స్టార్ నటుడు ఇప్పుడు హైదరాబాద్ కు షిఫ్ట్ అవుతున్నాడు. తెలుగులో వరుస అవకాశాలు వస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ కు షిఫ్ట్ అవ్వాలని ఫిక్స్ అయ్యాడట. ఇప్పటికే హైదరాబాద్ లోని బంజారాహిల్స్ ప్రాంతంలో ఓ ఇంటిని కొనుగోలు చేసినట్లు కూడా తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement