Sunday, May 5, 2024

Lal Salaam నుంచి “తేరా తిరువిజ” ఫస్ట్ సింగిల్ రిలీజ్ !

సూపర్ స్టార్ రజినీకాంత్ న‌టిస్తున్న లేటెస్ట్ మూవీ ‘లాల్‌సలామ్‌’. ఐశ్వర్య రజినీకాంత్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో విష్ణు విశాల్, విక్రాంత్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇక, తాజాగా ఈ మూవీ నుంచి ‘‘తేరా తిరువిజ’’ అనే సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్. వివేక్ రాసిన ఈ పాటను ఏఆర్‌ రెహమాన్ సంగీతం అందించగా.. శంకర్ మహదేవన్‌, ఏఆర్‌ రెహానా, దీప్తి సురేశ్, యోగి శంకర్ పాడాడు. ఈ మూవీని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరణ్‌ నిర్మిస్తుండగా.. ఏఆర్ రెహమాన్‌ సంగీతం అందిస్తున్నాడు.

YouTube video

ఇకపోతే, జై భీమ్‌ ఫేం టీజే జ్ఞానవేళ్‌ దర్శకత్వంలో తలైవా 170 (Thalaivar 170)కూడా చేస్తున్నాడు రజినీకాంత్‌. లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దీంతోపాటు లోకేశ్ కనగరాజ్‌ డైరెక్షన్‌లో తలైవా 171లో కూడా నటిస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement