Saturday, May 18, 2024

Adikesava OTT | ఓటీటీలోకి వచ్చేస్తున్న ఆదికేశవ..

మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ ప్రధాన పాత్రలో న‌టించిన యాక్ష‌న్ ఎంటర్‌‌టైనర్ ‘ఆదికేశవ’ శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీ లీల లేడీ లీడ్ రోల్ లో నటించింది. న‌వంబ‌ర్ 24న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయ్యింది. కాగా, తాజాగా ఈ మూవీ ఓటీటీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యింది.

ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకోగా.. ఈ మూవీని డిసెంబర్ 22 నుండి స్ట్రీమింగ్ చేయనుంది. ఇక సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లపై తెరకెక్కిన ఈ సినిమాలో జోజు జార్జ్, అపర్ణా దాస్, సదా, సుమన్, రాధికా శరత్‌కుమార్ ఇతరులు ముఖ్యమైన పాత్రల్లో నటించారు. జివి ప్రకాష్ కుమార్ ఈ మూవీకి సంగీతాన్ని అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement