Tuesday, May 14, 2024

ట‌క్క‌ర్ ఇచ్చేదెవ‌రు…

తెలుగు ప్రేక్షకులకు దగ్గరైనతమిళ హీరోలలో సిద్ధార్థ్‌ ఒకరు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరి ల్లు లవ్‌ ఫెయిల్యూర్‌ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం. సిద్దార్థ్‌ ‘టక్కర్‌’ అనే సిని మాతో సరికొత్తగా అలరించనున్నారు. ఈ చిత్రానికి కార్తీక్‌ జి. క్రిష్‌ దర్శకుడు. టీ-జీ విశ్వప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వివేక్‌ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిసున్నారు. ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్‌ కథానాయిక. మే 26న తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. టీ-జర్‌ లో సిద్ధార్థ్‌ సరికొత్త మేకోవర్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది

. తాజాగా ఈ చిత్రం నుంచి ”కయ్యాలే… ” అనే పాట వీడియోని విడుదల చేశారు. సిక్కింలోని బుద్ధ పార్క్‌ పరిసర ప్రాం తాల్లో చిత్రీకరించిన ఈ పాటలోని ప్రతి ఫ్రేమ్‌ ఎంతో అందంగా ఉంది. వాంచినాథన్‌ ము రుగేశన్‌ తన కెమెరాతో బంధించిన ప్రకృతి అందాలు కట్టిపడేస్తున్నాయి. నివాస్‌ కె ప్రసన్న అందించిన మ్యూజిక్‌ ఎంతో ఎనర్జిటిక్‌గా ఉం ది. ఇక దివ్యాంశ కౌశిక్‌ తన అభినయంతో పాట కు మరింత ఎనర్జీ తీసుకొచ్చారు. కథానాయిక స్వభావాన్ని, సమాజం పట్ల ఆమెకున్న అభిప్రా యాన్ని తెలిపేలా ఈ పాట సాగింది. కృష్ణ కాంత్‌ సాహిత్యం అందించారు. నిరంజనా రామన్‌ ఆలపించారు.


ఈ సినిమాలో అభిమన్యు సింగ్‌, యోగి బాబు, మునీశ్‌ కాంత్‌, ఆర్జే విజ్ఞేశ్‌ కాంత్‌ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. నివాస్‌ కె. ప్రసన్న సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌ గా వాంచినాథన్‌ మురుగేశన్‌, ఎడిటర్‌ గా జీఏ గౌతమ్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌ గా ఉదయ కుమార్‌ కె వ్యవహరిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement