Thursday, May 9, 2024

సురేఖ‌వాణి ల‌గ్జ‌రీకారు.. కూతురితో సెల‌బ్రేష‌న్స్

వీరిద్ద‌రిని చూస్తే త‌ల్లికూతుర్లు అంటే న‌మ్మ‌డం కొంచెం క‌ష్ట‌మే..కానీ త‌ప్పదు. వారే న‌టి సురేఖ వాణి, ఆమె కుమార్తె సుప్రీతా .. అక్కా చెల్లెళ్ల‌లా క‌నిపిస్తుంటారు. కాగా వీరిద్ద‌రు క‌లిసి ఓ లగ్జరీ కారు కొన్నారు. వీరిద్దరూ షోరూంలో ఎంజి బ్రాండ్ కారుని కొనుగోలు చేశారు. ఆ ఫొటోస్ ని సుప్రీతా సోషల్ మీడియాలో షేర్ చేసింది. చూస్తుంటే వీరిద్దరూ అదిరిపోయే లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ కారు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సంతోషాన్ని తల్లి కూతుళ్లు సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. మంచి విషయాలు జరగడానికి కొంత సమయం పడుతుంది అని సుప్రీతా ఈ ఫొటోస్ కి క్యాప్షన్ పెట్టింది. నెటిజన్లు వీరిద్దరికి శుభాకాంక్షలు చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ఇటీవల సుప్రీతా థాయిలాండ్ వెకేషన్ కి వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ పొట్టి షార్ట్ లో తన థండర్ థైస్ చూపిస్తూ సుప్రీతా యువత మైండ్ బ్లాక్ చేస్తోంది. అలాగే సముద్రరంలో బోటింగ్ చేస్తూ ఆమె ధరించిన ఓపెన్ షోల్డర్ డ్రెస్ కూడా మతులు చెడగొట్టే విధంగా ఉంది.కాగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఒకప్పుడు ఫుల్ బిజీగా గడిపిన సురేఖ వాణి ప్రస్తుతం అవకాశాలు లేక ఖాళీగా ఉంటోంది. ప్రస్తుతం ఆమె ఒకటి అర చిత్రాల్లో మాత్రమే కనిపిస్తోంది. అయితే సురేఖ వాణి ట్రెండుకి తగ్గట్లుగా సోషల్ మీడియాలో రెచ్చిపోతోంది.తన కుమార్తె సుప్రీతతో కలసి సురేఖ వాణి సోషల్ మీడియాలో చేసే హంగామా అంతా ఇంతా కాదు. తల్లీకూతుళ్లు ఇద్దరూ డాన్స్ చేసే వీడియోల్ని, గ్లామరస్ ఫొటోస్ ని తరచుగా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement