Tuesday, May 14, 2024

సుధీర్ బాబు కొత్త సినిమా -ఎవరితోనో తెలుసా ?

టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఇక ఆఖరుగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వచ్చిన వి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రస్తుతం సుధీర్ బాబు శ్రీదేవి సోడా సెంటర్ సినిమా చేస్తున్నాడు. దీంతోపాటు ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే సినిమా కూడా చేస్తున్నాడు.

అయితే తాజాగా మరో సినిమాని అనౌన్స్ చేశాడు సుధీర్ బాబు. ప్రముఖ నటుడు రచయిత హర్షవర్ధన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు సుధీర్ బాబు. ఇక ఈ సినిమాను శ్రీ వేంకటేశ్వర సినిమా ఎల్ ఎల్ పి బ్యానర్ కింద నారాయణదాసు నారంగ్, పుష్కురు రామ్మోహన్ నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి ఇంకా టైటిల్ ని ఫిక్స్ చేయలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement