Sunday, April 28, 2024

రాజమండ్రి: అట్టపెట్టెలో చిన్నారి… కాపాడిన కాటికాపరి

రాజమండ్రిలో దారుణం చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు అట్టపెట్టెలో తీసుకొచ్చిన శిశువును శ్మశానంలో వదిలేసి వెళ్లిపోయారు. కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న శిశువు ఏడుపును కాటికాపరి శివ గమనించాడు. వెంటనే చిన్నారిని చేతుల్లోకి తీసుకుని స్థానికంగా నివసించే వెంకటేశ్ దంపతులకు అప్పగించాడు. వారు వెంటనే స్థానిక ప్రత్యేక చిన్న పిల్లల సంరక్షణ యూనిట్‌కు తరలించారు.

అయితే శిశువు పరిస్థితి విషమంగా మారడంతో 108 నియోనాటల్ అంబులెన్స్ ద్వారా కాకినాడ నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఎన్ఐసీయూ)కు తరలించారు. చిన్నారి బరువు 750 గ్రాములు మాత్రమే ఉందని, ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఐసీడీఎస్ పీడీ జీవీ సత్యవాణి తెలిపారు.

ఈ వార్త కూడా చదవండి: భార్య ముక్కు కొరికిన భర్త

Advertisement

తాజా వార్తలు

Advertisement