Sunday, April 28, 2024

Sri Vishnu : మరోసారి సామజవరగమన జోడి

వరుస విజయాలతో మంచి ఫామ్‌లో ఉన్న హీరో శ్రీవిష్ణు తన కొత్త చిత్రం గురించి వెల్లడించారు. హుస్సేన్‌ షా కిరణ్‌ దర్శకత్వంలో ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ చిత్రంలో నటిస్తున్నారు. సందీప్‌ గుణ్ణం, వినయ్‌ చిలకపాటే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

- Advertisement -

‘సామజవరగమన’ చిత్రంలో శ్రీవిష్ణుకు జోడీగా నటించిన రెబా జాన్‌ ఈ చిత్రంలో నాయికగా నటిస్తోంది. ఈ సినిమా ఇప్పటికే అరవై శాతం చిత్రీకరణ పూర్తిచేసుకుంది. ఇంకా ఈ చిత్రంలో వీర్‌ ఆర్యన్‌, అయ్యప్ప శర్మ, సుదర్శన్‌, రచ్చ రవి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం విద్యాసాగర్‌, సంగీతం కాలభైరవ.

Advertisement

తాజా వార్తలు

Advertisement