Tuesday, April 30, 2024

TS : బీజేపీ తీర్థం పుచ్చుకున్న‌ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి

బీఆర్ఎస్ పార్టీకి ఉప్ప‌ల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి ఇవాళ రాజీనామా చేశారు. రాజీనామా ప‌త్రాన్ని కేసీఆర్‌కు పంపిన కొద్దిగంట‌ల వ్య‌వ‌ధిలోనే ఆయ‌న బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

ఉద‌యం 200మంది అనుచ‌రుల‌తో క‌లిసి మ‌ల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ అభ్య‌ర్థి ఈట‌ల రాజేంద‌ర్ స‌మ‌క్షంలో బీజేపీలో చేరారు. ఈట‌ల రాజేంద‌ర్ కాషాయ కండువా క‌ప్పి బేతి సుభాష్‌రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement