Monday, April 29, 2024

TS: నోటిఫికేషన్ విడుదల… నాల్గ‌వ విడ‌తలో ఎన్నిక‌లు… ముజమ్మిల్ ఖాన్

పెద్దపల్లిరూరల్, ఏప్రిల్ 18 (ప్రభ న్యూస్): భారత ఎన్నికల కమిషన్ నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం లోక్ సభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ముజమ్మిల్ ఖాన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని పార్లమెంటరీ స్థానాలకు ఎన్నికల కమిషన్ నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం నాల్గవ విడతలో ఎన్నికలు జరుగనున్నాయన్నారు.


ఏప్రిల్ 18 నుంచి ఏప్రిల్ 25 వరకు నామినేషన్లు ప్రభుత్వ పని దినాలలో ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని రిటర్నింగ్ అధికారి చాంబర్ వద్ద నామినేషన్లు స్వీకరించనున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 26న నామినేషన్ల స్క్రూటీని, 29 వరకు ఉప సంహరణ గడువు, మే 13న పోలింగ్, జూన్ 4న ఫలితాలు వెల్లడి కానున్నాయని ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement