Saturday, April 27, 2024

అలా అమెరికాపురములో…!!

గతేడాది మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అలా వైకుంఠపురములో. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ ని సాధించింది. ఈ సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించింది మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అనే చెప్పాలి. ఈ సినిమాకు అద్భుతమైన సంగీతాన్ని అందించారు.

అయితే తాజాగా తమన్ యూఎస్ఏ లో తన లైవ్ కాన్సర్ట్ ద్వారా ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. కాన్సర్ట్ కు అలా అమెరికాపురములో అనే పేరును పెట్టారు. ఇక ఈ కచేరి ఆగస్టు సెప్టెంబర్ నెలలో వాషింగ్టన్ డిసి, చికాగో ,న్యూజెర్సీ, డల్లాస్ వంటి ప్రధాన నగరాల్లో జరగనుంది. తమన్ తన బృందంతో పాటు యువ ప్లేబ్యాక్ గాయకుల బృందంతో ప్రత్యక్ష ప్రదర్శన ఇవ్వనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement